ప్రశ్నిస్తున్న యువతపై కేసులు..

ys-jagan-07-3.jpg

సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు అంతా యువతేనని ప్రశ్నిస్తున్న యువతపై కేసులు పెడుతున్నారన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న కేసుల్లో కేవలం 41ఏ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉందన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఇబ్బంది పెట్టడం కోసం కుటుంబ సభ్యులను కూడా స్టేషన్ కు తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. లోకేష్, పవన్ డీజీపీ మీద ఒత్తిడి తెచ్చి ఇదంతా చేయిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మా అమ్మ కారుకి ప్రమాదం జరిగితే నేను అమ్మను చంపే ప్రయత్నం చేశానని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇది అసత్యమని విజయమ్మ లెటర్ ఇస్తే అది ఫేక్ అన్నారు. విజయమ్మ వచ్చి వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసినట్టు ఫేక్ న్యూస్ వేశారు. డీజీపీ, పోలీసులకి ఒకటే చెబుతున్నాను. మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు మాత్రమే సెల్యూట్ చేయండి. వేరే వారికి సెల్యూట్ చేస్తే వృత్తిని కించ పరిచినట్టే. పోలీసులు కూడా మనస్సాక్షిని ప్రశ్నించు కోవాలి. అని జగన్‌ అన్నారు.

Share this post

scroll to top