గూడు చెదిరే గుండె పగిలే..

hydra-9.jpg

హైడ్రా కూల్చివేతలు పేదోళ్లను కన్నీరుపెట్టిస్తున్నది. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలతో మల్లంపేట, మాదాపూర్‌ సున్నం చెరువు పరిసర ప్రాంతాలన్నీ గరీబోడి ఆవేదన.. రోదనలతో ప్రతిధ్వనించాయి. నిరాహార దీక్ష చేసి కేసీఆర్‌ నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తే.. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పేదలను పీడిస్తున్నారంటూ బాధితులు గగ్గోలు పెట్టారు. తమ బతుకులు రోడ్డుపై పడుతున్నా.. ముఖ్యమంత్రి కనికరించడం లేదని కన్నీరుపెట్టుకున్నారు.

అసమర్థ ప్రభుత్వంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే పేదలంతా నిల్వనీడలేకుండాపోయిందంటూ గుండెలు బాదుకున్నా పోలీసులు లాగిపడేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇన్నాళ్లు నీడనిచ్చిన గూడు ఇకపై ఉండదనే ఆవేదనలో ఓ మహిళ కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. హైడ్రా కూల్చివేతలు పేదోడి పాలిట శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share this post

scroll to top