హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్..

hidra-11.jpg

హైదరాబాద్ లో అక్రమకట్టడలను నేలమట్టం చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాదాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ వంటి ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో నిర్మించిన అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాగా ఇప్పుడు హైటెక్ సిటీలోని చెరువులు, నాలాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెరువులు ఆక్రమించి కొంతమంది పలు బాడాబాబులు కట్టిన బిల్డింగులు పడగొట్టిన హైడ్రా ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. ర్వే చేసిన ఆ నివేదికను హైడ్రా ప్రభుత్వానికి అందించనుంది. కాగా హైడ్రా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి కూల్చివేతలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సర్వేను ఇంకో వారం రోజుల్లో హైడ్రా అధికారులు ప్రారంభించనున్నట్లు సమాచారం. 

Share this post

scroll to top