అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని స్టోరీలు రాసుకుంటా..

rgv-28.jpg

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నిత్యం ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడనడంతో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో 2022లో వ్యూహం సినిమా ప్రమోషన్స్ చేసేటప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది. కాగా ఇదే విషయంపై తాజాగా టీడీపీ, జనసేన నేతలు పోలీసులు ఫిర్యాదు చేయగా ఒంగోలులో ఆయనపై కేసు నమోదవ్వగా ఇటీవలే ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి.

ఆర్జీవీ విచారణకు సహకరించకపోతే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు సైతం హెచ్చరించారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్జీవీ తాను ఎవ్వరికి భయపడనని ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో నేను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తే అవసరమైతే జైల్లో కూర్చోని స్టోరీస్ రాసుకుంటానని చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top