తనకు ఫోన్ లేదని.. కనీసం నంబర్ కూడా లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇంట్లో వారు తనతో మాట్లాడాలంటే పీఏలకు ఫోన్ చేసి మాట్లాడతారని చెప్పారు. ‘నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. నాకు పబ్లిక్ లైఫ్.. ప్రైవేట్ లైఫ్ అంతా ఒకటే. ఇంట్లోకి రాగానే భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతా. వీలు కుదిరినప్పుడు సినిమాలు చూస్తా. అందరితో సత్సంబంధాలు ఉండాలని భావిస్తా’ అని సీఎం తెలిపారు.
నాకు ఫోన్ లేదు.. నంబర్ లేదు: జగన్
