పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కీలక విషయాలు..

ashok-12-.jpg

క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ఆయన మృతిచెందిన ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు భావించినా ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్‌ పగడాల హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ప్రమాదానికి గురైనంత వరకు అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు. మార్గమధ్యలో సీసీ ఫుటేజ్‌ యూపీఐ పేమెంట్స్‌, ఆయన రోడ్డుపై పడిపోవడం షాపులో కనిపించడం ఇలా అన్ని రకాల సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు. ఇక, ఈ కేసులో కీలక విషయాలను వెల్లడించారు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్.

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు వచ్చేలోపు ప్రవీణ్ ఆరుగురితో మాట్లాడినట్టు గుర్తించాం మీడియాలో అనుమానాలు వ్యక్తం చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించాం. కానీ, ఎవరు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. గత నెల 24వ తేదీన జరిగిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పదపై ఎవరు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదన్న ఐజీ పాస్టర్ ప్రవీణ్ మార్గమధ్యలో రెండు చోట్ల వైన్ షాప్‌లకి వెళ్లారని తెలిపారు. యూపీఐ పేమెంట్ చేసినట్లుగా కూడా గుర్తించా కోదాడ వద్ద బండితో పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు తెలిసి వివరాలు సేకరించాం విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ తో పాటు మరో వ్యక్తి విట్ నెస్ తీసుకున్నాం అని పేర్కొన్నారు.

Share this post

scroll to top