నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. ‘ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడుతుంది. బుధవారం, గురువారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెట్లు క్రింద నిలబడరాదు’ అని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం..
