ఏపి, తెలంగాణకు మరోసారి వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇరు రాష్ట్రాల్లో రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు.
రేపు శనివారం ఆదిలాబాద్, భూపాల్ పల్లి, ములుగు, కొత్త గూడెం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల,జనగాం, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.