దేశంలో అత్యాచార ఘటనలు విపరీతమవుతున్నాయి. రోజుకో ఎక్కడో చోట ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆ బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ మైనర్లుగా గుర్తించారు. కాగా.. ఈ వీడియోలు వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం..
