ఏపీలో పోలింగ్ రోజున మాచర్లలో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ చేపట్టగా మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం అతని పై సీరియస్ అయింది. అతనికి ఏడు ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఈసీ తెలిపింది. ఈ ఘటనపై వైసీపీ నేత సజ్జల స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఒక్కటే లీకైందా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆ వీడియో సరైనదేనా? కాదా అని కూడా చూడకుండా ఈసీ చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు.
పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియోనే లీక్ అయిందా?:సజ్జల
