అధికారం పోయేసరికి కేటీఆర్ హరీష్ రావుకు మెంటల్ ఎక్కింది..

jaga-reddy-26.jpg

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండిపాలెం బ్యాచ్ అయ్యింది అని విమర్శించారు. కేటీఆర్, హరీశ్ రావులకు పిచ్చిపట్టినట్లుంది. అధికారం పోయేసరికి కేటీఆర్, హరీశ్ కి మెంటల్ ఎక్కిందని మండిపడ్డారు. ఇంకా నాలుగు ఏండ్లు ఎప్పుడు అయిపోతుందాని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ నీ సీఎంనీ ఎప్పుడు బద్నాం చేద్దామాని చూస్తున్నారు. మేము అనని మాటలు అంటే కోపం రాదా బెవకూఫ్ చేతలు చేయొద్దు అని చెప్తున్నా నాకు కోపం వచ్చి కేటీఆర్, హరీష్, కేసీఆర్ నీ తిట్టనా అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ పాగల్ గాండ్లు అయ్యారా? అని ప్రశ్నించారు. అమెరికాలో ఉండి కేటీఆర్ ఫోటోలు పెట్టీ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ ఇది పద్దతి కాదు అని జగ్గారెడ్డి అన్నారు.

Share this post

scroll to top