టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి విడిపోయిన వచ్చిన వ్యక్తులు బ్రాంచీలుగాని, షామియానా కంపెనీలు లాగా ఏమైనా పెట్టుకుంటే మాకు తెలియదు. కానీ ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతే తప్ప అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఫ్యాన్స్ ఉన్నారని ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు.
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
