అధికారంలోకి వచ్చాక తొలిసారి భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు..

cbn-8.jpg

ఏపీలో మళ్లీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ అధికారంలో ప్రతిసారి ఈ కార్యక్రమం కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి-2 కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పొలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి-2 కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఊరూరా చెట్లు నాటాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో దూకుడు పెంచారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ అధికారులతో చెప్తున్న చంద్రబాబు అదే స్పీడుతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జన్మభూమి -2 కార్యక్రమాన్ని తీసుకురావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జన్మభూమి -2 ప్రారంభించాలని నిర్ణయించారు. 

Share this post

scroll to top