జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు..

jogi-23.jpg

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ ను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.

Share this post

scroll to top