రేపే దేవర రిలీజ్..

ntr-26.jpg

ఎన్టీఆర్ దేవర సినిమా రేపు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఇప్పటికే థియేట్రికల్ తో పాటు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్టు సమాచారం. దీంతో దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఇక హిట్ అవ్వాలంటే కనీసం 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దేవర హిట్ అయినట్టు అని సమాచారం. దీంతో ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్ ఏర్పడింది. సోలో హీరోగా ఎన్టీఆర్ కి మొదటిసారి ఇంత భారీ బిజినెస్ జరగడం, ఇంత పెద్ద టార్గెట్ రావడం. మూవీ యూనిట్ అయితే 500 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతుంది. మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

Share this post

scroll to top