వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం..

ntr-3.jpg

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వదర బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళంగా ప్రకటిస్తున్నా. అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Share this post

scroll to top