బస్సులో బ్యాటరీ పేలడంతో బస్సులో వ్యాపించిన మంటలు..

bus-18.jpg

స్కూల్ బస్సులో బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డిలోని రామారెడ్డి రోడ్డులో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెలుతుండగా ఆకస్మాత్తుగా బ్యాటరీ పేలింది. దీంతో బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో అందులోని విద్యార్థులు భయంతో కేకలు వేశారు. గమనించిన స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను రక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఘటనలో పిల్లంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై రవాణా శాఖ అధికారులు తరుచు తనిఖీలు నిర్వహించాలని, కేవలం విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగానే కాకుండా అడపదడపా ఆకస్మిక ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share this post

scroll to top