కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా కంగువా. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయ్యన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నేడు కంగువా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
కంగువా చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. ‘ది బ్యాటిల్ ఆఫ్ ప్రైడ్ అండ్ గ్లోరీ, ఫర్ ది వరల్డ్ టు విట్‌నెస్. కంగువ తుఫాన్ నవంబర్ 14 నుంచి మొదలవుతుంది’ అని స్టూడియో గ్రీన్ ఎక్స్‌లో పేర్కొంది. విషయం తెలిసిన సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10న అనుకున్న సినిమాను దాదాపు నెల ఆలస్యంగా.. నవంబర్ 14న విడుదల చేస్తున్నారు.