అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధికి చాలా సహకారం అందించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడం విషయంలో సంజయ్ ఎంపీగా చాలా కృషి చేసారు. నగర అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర చాలా కీలకమైందన్నారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరులో ఆయన సహకారం మరువలేనిదన్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని మంత్రి నిన్న సమీక్ష చేశారన్నారు. కరీంనగర్ నుంచి ఓటు హక్కుతో సహా ట్రాన్స్ఫర్ చేసుకున్న పొన్నం ప్రభాకర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ సమీక్ష కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా సాగిందన్నారు. కరీంనగర్ కార్పోరేషన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారన్నారు.
అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
