ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎ మ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఇవాళే విడుదల అయ్యేలా అందుకోసం అవసరమైన ఏర్పాట్ల విషయంలో కవిత సోదరుడు కేటీఆర్, కవిత తరపున లాయర్లు ప్రయత్నాలు స్పీడప్ చేస్తున్నారు. బెయిల్ కండిషన్లలో పేర్కొన్న షూరిటీ బాండ్లు, కవిత పాస్ పోర్టును ఈ సా.4 గంటలకు సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫార్మాల్టీస్ అన్ని పూర్తయితే రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ప్రస్తుతం కవిత ఉన్న తిహార్ జైలు అధికారులకు ఈమెయిల్ రూపంలో బెయిల్ ఆదేశాలు చేరనున్నారు.
ఫార్మాలిటీస్ పూర్తి అయిన అనంతరం కవిత జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ట్రయల్ కోర్టు నుంచి తిహార్ జైలుకు ఆదేశాలు చేరితే కవిత ఇవాళ విడుదల కానున్నారు. లేకుంటే రేపు ఉదయం కవిత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ ప్రక్రియ అంతా ఇవాళే పూర్తి అయితే సాయంత్రం 7 గంటలకు కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. లేకుంటే రేపు ఉదయం రిలీజ్ కానున్నాయి. ఒక వేళ ఇవాళే కవిత విడుదల అయినా ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. కవిత, కేటీఆర్, హరీశ్ రావులు ఇవాళ ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం కేటీఆర్, హరీశ్ రావుతో పాటు కవిత హైదరాబాద్ చేరుకుంటారు.