కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరపడానికి ఎంత సమయం అయినా కేటాయిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగూణంగానే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ఏకధాటిగా 16గంటలకుపైగా కొనసాగింది. ఉదయం 10గంటలకు విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణం అంశంపై మొదలైన చర్చ తెల్లవారు జామున 3.15 నిమిషాల వరకు చర్చించడంతో అసెంబ్లీ సమయం కొత్త రికార్డు నెలకోల్పింది. ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ప్రత్యేక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఇంత సేపు కొనసాగడం ఇదే మొదటి సారి కావడం విశేషం. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేవలం 10గంటల పాటు మాత్రమే అసెంబ్లీ సెషన్ కొనసాగింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పవర్ పాలిటిక్స్ పై హాట్ హాట్ చర్చ జరిగింది.
అసెంబ్లీ ఇంత సేపు కొనసాగడం ఇదే మొదటి సారి కావడం విశేషం..
