రాజకీయ ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా..

keethi-reddy-30.jpg

రాజకీయ ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేసి ఉంటాడని అంచనా వేశారు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. తాజాగా ఓఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడారు. రాజకీయ ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడని కాకినాడ పోర్టు వ్యవహారంలో కేసులు చుట్టుముట్టడంతో విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అన్నారు. పార్టీ ఆఫీసులపై, ఇళ్లపై దాడి చేయడం ముమ్మాటికి తప్పే అని ఫైర్ అయ్యారు కేతిరెడ్డి. ఇలా చేయడం బ్యాడ్ కల్చర్ నేర్పించడమే అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బూమ్ రాంగ్ అయ్యాయని చెప్పారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. లిక్కర్, ఇసుక పాలసీలు దెబ్బకొట్టాయని ఆగ్రహించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి, చంద్రబాబు అరెస్టు, భువనేశ్వరిని తిట్టడం వంటి ఘటనలు వైసీపీ ఓటమికి కారణం అయ్యాయి అన్నారు కేతిరెడ్డి.

Share this post

scroll to top