అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు..

amaravathi-11.jpg

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ అమరావతి అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునర్‌ ప్రారంభించడమే కాకుండా పలు కీలక సంస్థలను అమరావతికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక, అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం వరకూ త్రైప్రాక్షిక చర్చలు కొనసాగనున్నాయి. చర్చల తరువాత ఎంవోయూపై సంతకం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు కాగా, అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.

Share this post