చేసిన సినిమాలన్నీ ప్లాప్..

pranitha-07.jpg

ఎన్నో ఫ్లాప్ చిత్రాలు ఉన్నప్పటికీ, కొంతమంది తారలు బాలీవుడ్‌లో తమ స్థానాన్ని సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందులో పరిణీతి చోప్రా ఒకరు. 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’తో తొలిసారిగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ మహిళా అరంగేట్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఆఫర్ తనకు వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ తాను ఆ సినిమాను రిజెక్ట్ చేసింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 2023 సెప్టెంబర్ 24న ఉదయ్ పూర్ లో వీరిద్దరి వివాహం జరిగింది. రాఘవ్ చద్దాతో వివాహమైన తర్వాత తన జీవితంలో చాలా సానుకూల మార్పులు వచ్చాయని పరిణితి తెలిపింది. పెళ్లి తర్వాత పరిణితి నటించిన చమ్కిలా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఆమె నటనపై ప్రశంసలు వచ్చాయి. యానిమల్ సినిమాను తిరస్కరించినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని కూడా పరిణీతి చెప్పింది.

Share this post

scroll to top