మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఛాతిలో నొప్పితో ఒక్కసారిగా కొడాలి నాని కుప్పకూలిపోయారని హుటాహుటిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయనకు ఏమీ కాకుడదని క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటూ వైసీపీ కార్యకర్తలు దేవుడిని ప్రార్ధిస్తున్నారు.
కొడాలి నానికి గుండెపోటు ఆస్పత్రికి తరలింపు..
