నేడు MLC అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌..

nagababu-07.jpg

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నేడు అంటే శుక్రవారం రోజున మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్, మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగమాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ ఇప్పటికే సంతకాలు కూడా చేశారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నేడు నామినేషన్ దాఖలు చేయడంమే కాదు ఆయనకు మరో ఆఫర్‌ కూడా ఉందట. ఎమ్మెల్సీ అయిన తర్వాత.. కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు.

Share this post

scroll to top