నటుడు నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆమెపై నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసిన విషయం విదితమే. ఈ కేసులో భాగంగా కాసేపటి క్రితం ఆయన నాంపల్లి స్పెషల్ కోర్టు కు చేరుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి రెడ్డి, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు.
అయితే, మరికొద్దిసేపట్లోనే మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ రికార్డ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, అంతకు ముందు విచారణ సందర్భంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు కేటీఆర్ మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి కేసును ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే నేడు కేటీఆర్ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు.