తెలంగాణ రాష్ట్రం లో ఆర్ఆర్ ట్యాక్స్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీ లో అమృత్ పథకం లో జరిగిన అవకతవకలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు బడాబాబులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమైందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారని మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుతోందని ఎద్దేవా చేశారు.
అమృత్ 2.0 టెండర్లలో ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొత్తం 8 ప్యాకేజీలుగా అమృత్ 2.0 పథకానికి టెండర్లను పిలిచారని ఎలాంటి అర్హత లేకపోయినా శోదా కంపెనీ కి టెండర్లను కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన బావమరిది సృజన్‌రెడ్డి కి టెండర్లను అప్పగించారని ఆరోపించారు. మొత్తం రూ.8,888 వేల కోట్ల టెండర్లపై సమగ్ర విచారణ జరిపించి రద్దు చేయాలని తాము ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరామని గుర్తు చేశారు.