రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లపై కేటీఆర్ ఫైర్‌..

ktr-17.jpg

పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి అంటూ విరుచుకుపడ్డారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.

Share this post

scroll to top