అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాటం చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన రేవంత్. కేటీఆర్‌కి సవాల్ విసిరారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణకు అన్యాయం జరిగిందని అందరం కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామని పిలుపునిచ్చారు. అందరం కలిసి ఏకతాటిపైకి వచ్చి పోరాడుదాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు నిధులు తెస్తారో.. రాజీమానా చేస్తారో తేల్చుకోవాలన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో దీక్ష చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నమని.. అయితే జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం..
