కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ktr-21.jpg

కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్ సర్కార్ కుట్ర సాధింపులో భాగంగా ఎన్ని నోటీసులు ఇచ్చినా, అవన్నీ తప్పకుండా దూదిపింజల్లా తేలిపోతాయన్నారు కేటీఆర్. ముమ్మాటికీ న్యాయం, ధర్మం గెలుస్తుంది అన్నారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నాయి అని ఫైర్ అయ్యారు. కమీషన్, కమిటీలు పేరిట కాలయాపన చేస్తూ, 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. SLBC టన్నెల్ కూలిపోయి 3 నెలల అవుతున్నా మృతదేహాలను బయటకు తీయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే, పెద్ద వాగు కొట్టుకపోతే కమిషన్లకు కకృత్తి పడి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కేటీఆర్.

Share this post

scroll to top