తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు హైదారాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురువనున్నాయని రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక ఏపీ విషయానికి వస్తే సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం డెహ్రాడూన్, ఒరై మీదుగా జార్ఖండ్, గోపాల్‌పూర్ లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం లో బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు సుమారు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పార్వతీపురం, అ్లలూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.