ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంట్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. ఇదే క్రమంలో మహిళల కోసమై కేంద్రం బడ్జెట్ – 2023 లో మరో కొత్త పథకం కూడా తీసుకొచ్చింది. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. మహిళా ఇన్వెస్టర్ల కోసం కేంద్రం తీసుకొచ్చిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఇదొకటిగా చెప్పొచ్చు. భారతీయ మహిళల్లో పొదుపును ప్రోత్సహించేందుకు, ఆర్థిక సాధికారత పెంపొందించడంలో భాగంగా ఈ స్కీమ్ లాంఛ్ చేసింది. ఇక ఇటీవలి బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంటే దీంట్లో వడ్డీ రేటు, గడువు అంతకుముందు మాదిరిగానే ఉన్నాయి. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరిగా ఈ మహిళా సమ్మాన్ పథకంలో వడ్డీ రేట్లు మారవు. మిగతా పథకాల్లో దాదాపు ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్రం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ఇందులో మాత్రం స్థిర వడ్డీ రేటు ఉంటుంది.
ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అత్యంత ప్రజాదరణ పొందిన పథకం..
