దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అయితే బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో సోమ, మంగళ, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..
