టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య డైలాగ్స్, శర్వానంద్ కామెడీ టైమింగ్, హేశం అబ్దుల్ వహాబ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. కథను రివీల్ చేయకుండా ట్రైలర్‌ను కట్ చేశారు. శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు ట్రైలర్‌లో కనిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియకుండా ఉంది.
ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.