టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు గతేడాది పాప జన్మించింది. తమ కూతురికి దేవసేన శోభా MM అని నామకరణం చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దేవసేన జన్మించిన నేటికి ఏడాది. ఈరోజు దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో తన కూతురి గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన కూతురి క్యూట్ ఫోటోస్ షేర్ చేశారు మంచు మనోజ్. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు మంచు మనోజ్.
“సంవత్సరం క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా తయారైంది. ముగ్గురం నలుగురు అయ్యాము. నాలుగు పిల్లర్లు, అందమైన ఫ్యామిలీ. దేవసేన శోభా నువ్వు మా జీవితంలోకి వెలుతురు, ధైర్యం, సంతోషాన్ని తీసుకొచ్చావు. అమ్మ, నేను ధైరవ్ నిన్ను కాపాడుకుంటాం. నీకు లైఫ్ లో అంతా బెస్ట్ ఉండాలి. మంచి జీవితాన్ని సృష్టించుకుందాం. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పలేనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.