ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా..

mining-14-.jpg

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో పెద్ద ఎత్తున ఇసుక ఉండటంతో ఈ ప్రాంతం నుండి లారీలతో బుసక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తూ మైనింగ్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ప్రభుత్వం నుంచి మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఒక హెక్టార్ కి ఆరు లక్షల రూపాయలు చెల్లించాలి. ఇవేమీ చెల్లించకుండానే లారీలు, ట్రాక్టర్లతో బుసక తరలించుకు పోతుంటే మైనింగ్ శాఖ ఇటువైపు చూడని పరిస్థితి ఉంది. మరోవైపు పరిమితికి మించి లారీ, టిప్పర్‌లో బుసకను లోడు చేయటం, అతివేగంగా నడపటం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా చేసేంది అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరులే కావటంతో అడ్డుకునే వారు లేకుండా పోయారు.

Share this post

scroll to top