రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25 నిర్మాణాలు ఉన్నాయి. 18 నెలల కాలంలో పూర్తి చెయ్యాలనే దిశగా సూచనలు చేశారు నారాయణ.
అమరావతి రాజధాని రీ లాంచ్ కార్యక్రమం..
