ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. గత ప్రభుత్వం రాజధాని అమరావతి కాదని చెప్పింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు. ఇదే విషయాన్ని రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి నిన్న తీసుకువచ్చారు. న్యాయ పరమైన అంశాలు చర్చించి కేంద్రంతో మాట్లాడతా అని సీఎం చంద్రబాబు. రైతులకు చెప్పారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత..
