కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. కేటీఆర్‌కు పదవి పోయిందనే అసహనం ఎక్కువ ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు. గతంలో విదేశీ విద్య చదివే విద్యార్థులకు ఏటా 150 మంది కే ఇచ్చే వాళ్లు అని ఇప్పుడు 500 మంది విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం అని గుర్తించినందుకు కేటీఆర్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కి కౌంటర్..
