హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో మంత్రి సీతక్క, SERP CEO దివ్యా దేవరాజన్, ములుగు కలెక్టర్ దివాకర్‌లతో ఐటీ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్వాల్కమ్, బోష్, గ్రాన్యుల్స్ ఇండియా, టీసీఎస్, ఉషా, నిర్మాన్ తదితర కంపెనీల ప్రతినిధులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో కార్పొరేట్ కంపెనీలు పని చేస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. చివరి వరుసలో వున్న వారి అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని కోరారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరచాలని సూచించారు.
కార్పొరేట్ కంపెనీలు తమ వంతు సహకారం అందించాలి..
