కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్‌చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గత సమవేశాల్లో మేయర్ పక్కన కుర్చీలో ఎమ్మెల్యే కూర్చున్నారు. ఎమ్మెల్యే స్పీచ్ మొదలుపెట్టగానే కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సొంత డబ్బా వద్దు, సమస్యలపై చర్చిద్దామంటూ కేకలు వేశారు.
ఎవర్నీ వదిలిపెట్టనంటూ కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ..
