ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు, ఒక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఏపీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి. ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది.