మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికా, యూరోపియన్ దేశాలను వణికించిన ఈ వైరస్ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మరో అనుమానిత కేసు కేరళలోని మలప్పురంలో వెలుగులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. అతని లక్షణాలను బట్టి అనుమానాస్పద కేసుగా గుర్తించారు. ఢిల్లీలో ఇటీవల ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించారు. హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి టెస్టుల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు..
