తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని తెలిపింది. కాగా రానున్న మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చల్లటి కబురు.. మూడు నాలుగు రోజుల్లో ఏపీకి తొలకరి పలకరింపు
