తెలుగు రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు..

havi-rain-26.jpg

తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండగా మారాయి. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. నాలుగు రోజులుగా ముసురు ఏకధాటిగా పడుతుండటంతో రెండు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగి చెరువులు నిండాయి. బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద పోటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11 లక్షల 31వేల క్యూసెక్కుల వరద వెళ్తోంది.

Share this post

scroll to top