పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదు..

ayodhya-28.jpg

ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా సాయిరెడ్డి బాటలో నడుస్తున్నారనే ప్రచారం గుప్పుమంది. రేపోమాపో అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపించాయి. అయితే, తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే కనపడతాయని, ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలని సూచించారు. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని, రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన వ్యక్తిగతమన్నారు. ఇక, వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు. మా పార్టీలో లోపాలు లేకపోతే, మళ్లీ ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్లం కదా? అని ప్రశ్నించారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.

ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తులు, పల్లాలు ఉంటాయి. ఒత్తిడి తట్టుకొని నిలబడగలిగితే, పార్టీలు బ్రతుకుతాయి, లేదంటే మనుగడ చాలిస్తాయి అన్నారు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి. మా పార్టీలో అన్ని కరెక్ట్ గా జరిగితే మొన్న ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్లం పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటాం అన్నారు. నేను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారం వాస్తవం కాదు. ప్రతి కుటుంబంలో అలకలు, కలతలు ఉన్నట్లే, ప్రస్తుతం వైసీపీలో ఉన్నాయన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి..

Share this post

scroll to top