ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్న ఆయన భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవుచెప్పారు. అసలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. ఇక, వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణమైన విషయం అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.
ఏపీ సర్కార్ పై మండిపడ్డ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి..
