వైసీపీకి మరో షాక్ తగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే పలువురు టీడీపీలో చేరగా తాజాగా మరో కీలక నేత కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రేపు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కొంత కాలంగా నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో మోపిదేవి భేటీ అయ్యారు. రేపు వైసీపీ రాజీనామా చేసి, త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
టీడీపీలోకి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి..
