ఏపీలో గాడి తప్పిన‌ ప‌రిపాల‌న‌..

subha-21.jpg

ఏపీలో ప‌రిపాల‌న గాడి త‌ప్పింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ అరాచకాల‌పై పార్ల‌మెంట్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌క పరిపాలనను కేంద్రం సరిదిద్దాలన్నారు. ఏపీలో విషయంలో కేంద్ర మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, ఏపీలో బీసీ కులగణన జరగాలన్నారు.


రాజ్యసభలో కేంద్ర హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చర్చలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్  మాట్లాడుతూ..‘తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు తొక్కిసలాట ఘటనపైన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌమ్యుడైన ఎంపీ మిథున్ రెడ్డిపై, రెడ్డప్పపై దాడి జరిగింది. ఆయన ఇల్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇదేం రకమైన పరిపాలన దీనిపైన కేంద్రం చర్యలు తీసుకోవాలి.

Share this post

scroll to top